
జనం న్యూస్ మామిడి రవి శాయంపేట మండలం రిపోర్టర్ శాయంపేట
మండలం భారతదేశ యువత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ని స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. దేశం కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చారిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. ఐటీ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు. విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీ అని అన్నారు. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ అని వెల్లడించారు. మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మహిళా సాధికారతకు అడుగులు వేసినవారు రాజీవ్ గాంధీ అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిందం రవి , బాసని మార్కండేయ, ఏరుకొండ శంకర్, మోతే వెంకన్న, గోపాల్ రెడ్డి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.