
జనం న్యూస్,ఆగస్టు20,అచ్యుతాపురం:
యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా స్థానిక డావిన్సీ ఇంటర్నేషనల్ స్కూల్, తిమ్మరాజుపేట నందు ఈనెల 23 శనివారం నాడు సుమారు 20 కంపెనీలతో నిర్వహించబోయే మెగా జాబ్ మేళా గోడ పత్రికను బుధవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.అనంతరం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్.గోవిందరావు మాట్లాడుతూ,ఈ ఇంటర్వ్యూలలో పదవ తరగతి,ఐటిఐ,డిప్లొమా, డిగ్రీ మరియు పిజి వరకు చదువుకొని 18 నుండి 35 సంవత్సరాల వయస్సు గల యువతీ, యువకులు జాబ్ మేళా లో పాల్గొనవచ్చునని ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువతీ,యువకులు naipunyam.ap.gov.in వెబ్ సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, రిఫరెన్స్ నెంబర్ తో పాటుగా ఎక్కువ రెజ్యూములు,ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు జెరాక్స్ లతో ఉదయం 9 గంటలకు జాబు మేళా జరుగు ప్రదేశానికి హాజరు కాగలరని మరిన్ని వివరాలకు 9492429425 నెంబర్ ను సంప్రదించాలని కోరారు.