
జనం న్యూస్ 21ఆగష్టు పెగడపల్లి ప్రతినిధి.
ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోమాజీ భారత ప్రధాని భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 81వ జయంతిని ఘనంగా నిర్వహించారు.
ఈసందర్భంగానాయకులుమాట్లాడుతూ రాజీవ్ గాంధీకి రాజకీయాలపై ఆసక్తి లేదు. అతను విమాన పైలట్‌గా పనిచేసేవారు. కానీ 1980లో తన తమ్ముడు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం తర్వాత, రాజీవ్ గాంధీ తన తల్లి ఇందిరా గాంధీకి మద్ధతుగా 1981లో రాజకీయాల్లోకి ప్రవేశించాడు. పిదప, 1983లో, అతను ఉత్తరప్రదేశ్ నుండి అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు. 1984 అక్టోబరు 31న ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆమె అంగరక్షకులచే హత్యకు గురయ్యారు. అప్పుడు 1984లో రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. తదుపరి జనరల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించి ప్రధానమంత్రిగా కొనసాగాడు. 1985లో ముంబైలో జరిగిన ఏఐసీసీ సర్వసభ్య సమావేశంలో రాజీవ్ గాంధీ సందేశ్ యాత్రను ప్రకటించాడు. అఖిల భారత కాంగ్రెస్ సేవాదళ్ దీనిని దేశవ్యాప్తంగా నడిపింది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు (PCC), పార్టీ నాయకులు కలిసి ముంబై, కాశ్మీర్, కన్యాకుమారి, ఈశాన్య ప్రాంతాల నుండి నాలుగు పర్యటనలు చేశారు. మూడు నెలలకు పైగా సాగిన ఈ యాత్ర ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ముగిసింది.రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆధునీకరణ, ఉదారీకరణలపై దృష్టి సారించింది. కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్లు వంటి రంగాలలో అతను అనేక ముఖ్యమైన సంస్కరణలను ప్రవేశపెట్టాడు. రాజీవ్ గాంధీని భారతదేశంలో సమాచార విప్లవ పితామహుడిగా పరిగణిస్తారు. దేశంలో కంప్యూటరైజేషన్, టెలికమ్యూనికేషన్ విప్లవం ఘనత అతనికే చెందుతుంది. అతను విదేశీ విధానంలో చురుకైన పాత్ర పోషించాడు. శ్రీలంక, సోవియట్ యూనియన్ తో సంబంధాలను మెరుగుపరచడానికి కృషి చేశాడు. స్థానిక స్వపరిపాలన సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు కృషి చేశారు. రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తిరెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు వర్గాల శ్రీనివాస్ కడారి తిరుపతి చెట్ల కిషన్ విజయభాస్కర్ శ్రీరామ్ అంజయ్య అంజి నాయక్ ఆకుల విష్ణు రవి నాయక్ మందపల్లి అంజయ్య అమీర్ శెట్టి లక్ష్మీనారాయణ జెసెట్టి లక్ష్మీనారాయణ బండారి శ్రీనివాస్ తడగొండ రాజు మేకల మల్లయ్య రామ్ రెడ్డి నిక్షిత్ రెడ్డి శ్యాంసుందర్ రెడ్డి పవన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి సుధీర్ తోట మల్లేశం కట్ల సత్తయ్య రమేష్ గౌడ్ కార్యకర్తలు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.