
జనం న్యూస్ ఆగష్టు 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి నూతన ఎస్సైగా దుర్గం మహేందర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భంగా ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు, అసాంఘిక కార్యక్రమాలు, జూదం, గంజాయి, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సాధిస్తామన్నారు, రాబోయే గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని మండల ప్రజలకు తెలియజేశారు, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐకి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు,