
జనం న్యూస్ ఆగస్టు 20 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోన మండలం, చేయ్యరులో మండల బీజేపీ అధ్యక్షులు మట్ట శివకుమార్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సారధ్యం యాత్ర కార్యక్రమం మండల ఇంచార్జి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారు సారధ్యం యాత్ర ద్వారా జిల్లా లో శోభాయాత్ర అమలాపురం లో నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ఈ సమావేశానికి మండలం నుంచి అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ జిల్లా డైరెక్టర్ మట్టా సూరిబాబు ఎస్ నాగేశ్వరరావు మండల ప్రధాన కార్యదర్శి కొత్తలంకు సురేష్ ,కోట సత్యప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.