
జనం న్యూస్, ఆగస్టు20, అచ్యుతాపురం:
అచ్యుతాపురం ఏపీ సెజ్ అచ్యుతాపురం,రాంబిల్లి మండలాల పరిధిలో ఉన్న కంపెనీల కాలుష్య వ్యర్థాలను ఉప్పుటేరులోకి విడిచి పెట్టడంతో అధిక సంఖ్యలో చేపలు మృత్యువాత పడడాన్ని మత్స్యకారులు చూసి ఆవేదన చెందుతున్నారు. జీవనోపాధి కోల్పోయి ఏమి చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.పలుమార్లు ఉప్పుటేరులో చేపలు మృత్యువాత పడుతున్నా అధికారులు చూసి ఎలాంటి పరిష్కారం చూపడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు వల్ల ఎటువంటి పరిష్కారం లభించలేదని మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో పాటు మత్స్యకారులు జీవనాధారమైన సముద్రం,ఉప్పుటేరుతో చెలగాటం ఆడుతూ, భూగర్భ జలాలను నాశనం చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.