జనం న్యూస్ జనవరి 28 నేరేడుచర్ల:కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారనీ కష్ట పడితే సాధించలేనిది ఏది లేదు అని నిరూపించిన చింతమల్ల రాంబాబు గారినీ బొల్లేదు నాగరాజు పవిత్ర దంపతుల ఆధ్వర్యంలో రామాపురం ఏడవ వార్డు యువకులు సన్మానించారు. ప్రతి ఒక్కరికి ఏదో సాధించాలని కోరిక తపన ఉంటుంది. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుండి ఏదో సాధించాలానే సంకల్పంతో చదువుకొని స్వశక్తితో పైకి వచ్చి చదువుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నమ్మిన వ్యక్తి, మొదట జడ్పీహెచ్ఎస్ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ గా ప్రస్థానం మొదలుపెట్టి అనతి కాలం లోనే MJPTBCWERIS (మహాత్మ జ్యోతి బా రావు పూలే గురుకుల )ఉమ్మడి ఖమ్మం జిల్లా RCO గా పదోన్నతి పై ఉన్నత ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన చింతమల్ల రాంబాబు గారికి వారి తల్లిదండ్రులు సైదులు కోటేశ్వరమ్మ, భార్య ప్రీతి కి స్థానిక యువకులతో సత్కారించడం జరిగింది . ఇట్టి కార్యక్రమంలో ఆర్.సీ.ఓ రాంబాబు మత్లాడుతూ నేను ఈ స్థాయి కి వచ్చాను అంటే అన్ని విధాలుగా నా కుటుంబ సభ్యులకు తోడ్పాటు అందించడం కష్టపడి చదవడం అంది ఒచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక్కొక్క మెట్టుగా మలుచుకొని నేను ఇంత గొప్ప స్థాయిలో ఖమ్మం జిల్లా బీసీ గురుకుల ఆర్ సి ఓ గా పదవిని చేపట్టటం జరిగినదని వారు అన్నారు. ఇట్టి కార్యక్రమంలో కామళ్ళ రామకృష్ణ, బైరం మధు,అంగరాజు సతీష్,చండమల్ల నవీన్,చందమల్ల గోపి,పగడాల మహేష్,వాస మధు,కడమంచి కరుణాకర్,సాంబ, సామా నాగరాజు, తదితరులు పాల్గొన్నారు
ఆయన బంధువులు హర్షాన్ని వ్యక్తం చేశారు.