
జనం న్యూస్ ఆగస్టు 20 సంగారెడ్డి జిల్లా: హత్నూర మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి చెత్తా చెదారంతో పేరుకుపోయి చాకి చెరువులోకి వర్షపు నీళ్లు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది. అదిగమనించిన హత్నూర గ్రామస్తులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు. చాకి చెరువులోకి వెళ్లాల్సిన వర్షపు నీళ్లు కట్టుకాలువలో పెద్ద ఎత్తున పేరుకు పోయిన పిచ్చి మొక్కలతో అడ్డంకులు ఏర్పడి నేరుగా పొలాల్లోకి వర్షపు నీళ్లు చేరుతున్నాయని అన్నారు. వర్షపు నీటి ప్రభావంతో పొలం మడికట్లు తెగి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు గ్రామస్తులు యువకులు కలిసి జెసిపి సహాయంతో కట్టు కాలువలో పేరుకు పోయిన పిచ్చి మొక్కలను తొలగించారు. అంతలోనే అటువైపు వెళ్తూ గమనించిన హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్సం సంతోషం వ్యక్తం చేశారు. గ్రామస్తులను రైతులను అభినందించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హత్నూర మండలంలోని ఏ గ్రామంలోనైనా ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన తాసిల్దార్ కార్యాలయానికి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందిన వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శులు పోలీసులు అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్ పారిశుద్ధ్య కార్మికులు గ్రామస్తులు చెక్క రవీందర్ గౌడ్ పండుగ శేఖర్ పొట్ల చెరువు నరేందర్ వల్లి గారి దుర్గేష్ పొట్లగళ్ళ పెంటయ్య నల్లోల్ల ఎల్లయ్య నల్లోల్ల నాగేష్ బోరుపట్ల కిష్టయ్య కొత్తకుంట శంకర్ జనార్ధ గ్రామస్తులు రైతులు యువకులు తదితరులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
