
(జనంన్యూస్)ఆగస్ట్. 21
పండుగలు భక్తిని చాటాలి. కానీ విషాదాలు కావద్దు. వినాయక చవితి ఊరేగింపులు, శోభాయాత్రలు తగిన జాగ్రత్తలతో నిర్వహించుకోవాలి. వినాయక విగ్రహాలు వీలైనంత చిన్నవిగా ఉండాలన్నారు. పరిమితికి మించి పెద్ద విగ్రహాలు తెచ్చేటప్పుడు, నిమజ్జన సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు. మండపాల డెకరేషన్, సౌండ్ బాక్స్ ల ఏర్పాట్లలో విద్యుత్ తో జాగ్రత్తగా ఉండాలి. మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా ఆన్ లైన్ లో అనుమతి తీసుకోవాలి. నిమజ్జనం సమయంలో మత్తు పదార్థాలు సేవించవద్దని, చెరువులు, కుంటల్లో లోతుకు వెళ్లొద్దని పాపన్నపేట ఎస్సై S.శ్రీనివాస్ గౌడ్ గారు పేర్కొన్నారు.