
జనం న్యూస్ ఆగస్టు 21 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచెడ్ మండల స్థాయి పాఠశాల క్రీడా సమాఖ్య ఎం ఈ ఓ గారి అధ్యక్షున మండల స్థాయి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది . తేది 28-08-2025 నుండి 30-08-2025 వరకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపాడం జరిగింది . ఈ క్రీడలు అండర్ 14&17 బాలబాలికలకు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడాల నిర్వహణ తేదీలు 28-08-2025 గురువారం ఖో-ఖో 29 -08-2025 శుక్రవారం కబడ్డీ 30-08-2025 శనివారం వాలీబాల్ క్రీడా స్థలం : జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్కుల్ క్రీడా మైదానంలో పోటీలు నిర్వహించబడును చిలిపిచేడ్ మండలంలోని పాఠశాల విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొని తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులకు జిల్లా స్థాయిలో జరిగే క్రీడలకు పంపియడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ దరూ ఈ క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని మండల విద్యాధికారి తెలపడం జరిగింది .ఈ కార్యక్రమంలో మండలంలోని ఉన్నత పాఠశాలల పీఈటీలు, మరియు ప్రధానోపాధ్యాయులు పాల్గొనడం జరిగింది