మద్నూర్ ఆగస్ట్ 21 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం రాచూర్ గ్రామంలో ప్రజలు అనారోగ్యంతో బాధ పడుతుండగా విషయము తెలుసుకున్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు తక్షణమే స్పందించి రాచూరు గ్రామానికి వెళ్లారు వైద్య శిబిరం ఏర్పాటు చేయించారు ఎమ్మెల్యే గ్రామంలో పర్యటించి ప్రజల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకొని వెంటనే వైద్య అధికారులకు ఫోను చేసి పరిస్థితి వివరించారు వైద్యుల దాన్ని గ్రామానికి పిలిపించి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు వైద్యుల బృందం అనారోగ్యానికి గురైన వారికి పరీక్షలు చేసి వైద్యం అందించి మందులు అందజేశారు వైద్యుల సూచన మేరకు కొంతమంది పేషెంట్స్ ను మద్నూర్ మండల కేంద్రంలోని ప్రైమరీ హెల్త్ సెంటర్కు పంపించారు ఎమ్మెల్యే తో పాటు చెవుల వార హనుమాన్లు రాచూర్ రాజు పటేల్ తదితరులు పాల్గొన్నారు