జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 21 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం చిలకలూరిపేట ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసియున్న శ్రీ దత్త సాయి సన్నిధిలో ఈరోజు శ్రావణమాసం ఆఖరి గురువారం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగినాయి శ్రీ దత్త సాయి కి భక్తులు ప్రదక్షిణ కార్యక్రమం అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాలు జరిగినాయి అనంతరం కుమారి బాల లక్ష్మీ భవిష్య పుట్టినరోజు సందర్భంగా హోల్ సెట్ రవికుమార్ నవీన ఆర్థిక సహకారంతో అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది, ట్రస్టు నిర్వాహకులు పూసపాటి బాలాజీ మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలిగి ఉన్నవారికి అన్నం పెట్టాలయ్యా అన్న శ్రీ దత్త సాయి సుత్తిని దాతల సహకారంతో భక్తుల సహకారంతో ఆచరిస్తూ ఎన్నో సంవత్సరములుగా ప్రతి గురువారం అన్నసంతర్పణ కార్యక్రమం చేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఈ అన్నసంత్రపుణ కార్యక్రమానికి సహకరించాలని కోరారు ముఖ్యంగా వచ్చే బుధవారం వినాయక చవితి అందరూ మట్టి గణపతులతో పూజ చేసుకుని పర్యావరణాన్ని ఆధ్యాత్మికతను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు కొత్తూరు హనుమంతరావు మద్దుల ప్రసాద్ పోలిశెట్టి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు