
,జనం న్యూస్,ఆగస్టు21,అచ్యుతాపురం:
అంగన్వాడీలకు కనీస వేతనాలు పెంచాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు,సంక్షేమ పథకాల అమలు చేయాలని స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టి డిటీ శ్యామ్ కి మరియు ఎంపీడీవో కార్యాలయం వద్ద పెన్షన్ డ్యూటీ మినహించాలని ధర్నా చేసి ఈఓఆర్డి శ్రీనివాసరావుకు వినతిపత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ కె సోమునాయుడు, నారాయణమ్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2014 నుండి రాష్ట్ర ప్రభుత్వం 2019 నుండి వేతనాలు పెంచలేదని,45 రోజులు చారిత్రక సమ్మె చేయడంతో 2024 జూలైలో వేతనాల పెంచుతామని చెప్పి ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, పోషణ బాల సంజీవని యాప్స్ అమలుకు ఫోన్లు సపోర్ట్ చేయడం లేదని, అధికారులు లబ్ధిదారులకు ఫోటో క్యాప్చర్,ఓటిపి ఎఫ్ఆర్ఎస్ ద్వారా సర్కిల్ ఇవ్వాలని పెట్టిన నిబంధన అమలు చేయడానికి అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సరుకులు అన్ని ఒకసారిగా రావటం లేదని, నెట్టు సిగ్నల్ లేకపోవడం వల్ల సర్వర్లు పనిచేయలేకపోవడం వల్ల లబ్దిదారులు ఇబ్బందులు పడుతున్నారని అంగన్వాడీలకు వేతనాలు పెంచి మినీలను మెయిన్ వర్కర్లుగా మార్చుతూ జీవో ఇవ్వాలని యాప్ లు కలిసి ఒక యాప్ గా మార్పు చేయాలని ఎఫ్ఆర్ఎస్ ఇన్ అవుట్ రద్దు చేయాలని, నిర్వహణ సెంటర్ నిర్వహణకు ట్యాబ్లు 5జి నెట్ ఇవ్వాలని ప్రధానమంత్రి మాతృ వందనం పథకంనీ కొత్తగా అంగన్వాడీలకు అప్పగించరాదని,గ్రాడ్యుటి జీవోలో మార్పులు చేయాలని, హెల్పర్లు ప్రమోషన్ లకు గ్లైడెన్స్ రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరలక్ష్మి, అంబిక, హేమ కుమారి,మంగ ,యమునా నారాయణమ్మ, భారతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.