
గంగారం మండలం మహబూబాబాద్ జిల్లా
జనం న్యూస్ ఆగస్టు 21 (నూకల రవీందర్)
మండలం లోని రైతు వేదిక మండల వ్యవసాయ అధికారి వేణు యాదవ్. ఫర్టిలైజర్ డీలర్లతో సమావేశం గురువారం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ గంగారం బాలకిషన్ మరియు ఎస్ హెచ్ ఓ గంగారం రవికుమార్ మరియు ఏఈఓలు ధరణీష్, కిషోర్ కుమార్, సంతోష్ పాల్గొన్నారు. మండల ఎరువుల డీలర్లు పాల్గొనడం జరిగింది. మండల వ్యవసాయ అధికారి T. వేణు యాదవ్ మాట్లాడుతూ మండలంలోని ఫర్టిలైజర్ డీలర్లందరు యూరియ బ్లాక్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అదే విధంగా ప్రతి యొక్క డీలరు యూరియ అమ్మకాలను వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో జరపాలని సూచించారు. ఎలాంటి అవకతవక లు జరిగిన వారి పై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అలాగే ప్రతి యొక్క డీలరు స్టాక్ రిజిష్టరు మరియు బిల్ బుక్స్ సక్రమంగా నిర్వహించాలని సూచించటం జరిగింది. ఫిజికల్ స్టాక్ మరియు ఈ-పాస్ మెషిన్లోని స్టాక్ లను ఎప్పటికప్పుడు సరిచూసు కోవాలని హెచ్చరించటం జరిగింది .
