
జనం న్యూస్ 22ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి
గణపతి నిమగ్నం పట్ల సంబంధిత అధికారులు నియమ నిబంధనలు పాటించాలని చెప్తున్నారు తప్ప,మట్టి గణపతిని పెట్టి -పర్యావరణాన్ని కాపాడుదామని ఆలోచన కరువైంది, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను విడనాడదాం. అనే నినాదంతో యువతలో ప్రతిజ్ఞ చేయిస్తూ, ఇళ్లల్లోమట్టి గణపతిని పెట్టించాలని పర్యావరణాన్ని కాపాడే బాధ్యత అందరిలోనూ ఉండాలని రచ్చబండ పై ప్రజలు అంటున్నారు, ప్రభుత్వ అధికారులు, సదస్సులు సమావేశాలు పెట్టాలని బహిరంగ ప్రదేశాల్లో జనం ఎక్కువగా గుమ్మి గూడిన ప్రాంతాల్లో. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు చైతన్యం రావాలని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమని, గాలి నీరు కాలుష్యం అవకుండా పర్యావరణ రహిత విగ్రహాలను తయారు చేయాలని అలాంటి విగ్రహాల్ని నిమజ్జనం చేయాలని తద్వారా పర్యావరణాన్ని మనం పరిరక్షించుకునేవారు అవుతామని ప్రజలు కోరారు