
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 22
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు, తాడివారిపల్లి, తుమ్మలచెరువు గ్రామాలలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సతీమణి కందుల వసంత కుమారి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు, చెక్కులు పంపిణీ కి విచ్చేసిన కందుల వసంత కుమారి ని మహిళలు శాలువాతో పూల మాలతో సత్కరించారు తర్లుపాడు గ్రామానికి చెందిన మేకల చంద్రమౌళి, యరదేశీ హేమలత , తాడివారిపల్లి సంజీవయ్య, తుమ్మలచెరువు గ్రామానికి చెందిన షైక్ మాబు కు కలిపి 4 లక్షల 44 వేల రూపాయలు చెక్కులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో టిడిపి నాయకులు ఉడుముల చిన్నప రెడ్డి, కంచర్ల కాశయ్య,పి గోపినాధ్, ఈర్ల వెంకటయ్య, కాళంగి పెద్ద శ్రీను, గౌతుకట్ల సుబ్బయ్య, ఈర్ల పెద్ద కాశయ్య, వెన్నా రాజా రామ్ రెడ్డి, వెన్నా వెంకటరెడ్డి, నంబుల లక్ష్మయ్య,మేకల వెంకట్, గోసు నరసింహ,షైక్ ఖాసీం వలి,షేక్ బాషా తదితరులు పాల్గొన్నారు