జనం న్యూస్ ఆగస్టు 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది, జానపద, సంగీత,విద్య,సాహిత్య, సామాజిక సేవా, రంగాలలో సేవ చేసిన వారిని మరియు అత్యంత ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి దాశరధి కృష్ణమాచార్య శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకొని మరియు డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతిని కలుపుకొని సంయుక్తంగా నిర్వహించిన దాశరధి సినారే ఎక్సలెన్స్ అవార్డు 2025 గాను ప్రజావాగ్గేయ కారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బాషా సాంస్కృతిక శాఖ సలహాదారులు దరువు అంజన్నకు ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలు ఇందిరా మాట్లాడుతూ దరువు అంజన్న తెలంగాణ ఉద్యమంలో అగ్ర భాగాన నిలిచాడని ఎంతో పోరాటపటిమ కనబరిచాడని అదేవిధంగా గత 30 సంవత్సరాలుగా జానపద సాహిత్య, సామాజిక సేవ, విద్య రంగాలలో ఎనలేని ప్రతిభ కనబరుస్తున్నాడని అందుకుగాను ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని ఆమె హర్ష భావం వ్యక్తం చేశారు, ఉపాధ్యక్షులు విల్సన్ మాట్లాడుతూ దరువు అంజన్న కళారంగానికి మరియు సామాజిక రంగానికి ఎనలేని కృషి చేస్తున్నారని ఆదరణ లేని కళాకారులకు ఒక దారి చూపిస్తున్నాడని ఆయనకు ఈ అవార్డు లభించడం గర్వంగా ఉందని అన్నారు, ప్రముఖ గాయని ప్రసన్న మాట్లాడుతూ ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారు దాశరధి సినారె 2025 ఎక్సలెన్స్ అవార్డు దరువు అంజన్న లాంటి ప్రజా కళాకారులకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత దరువు అంజన్న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుందని వారిలో ఉన్న ప్రతిభను వెలికితీస్తుందని భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి కళాకారులను ఉత్సాహపరుస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాషా సాంస్కృతిక టూరిజం ఎక్సైజ్ శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు తమపై నమ్మకంతో ఇచ్చిన సలహాదారుల బాధ్యతను గురతర బాధ్యతతో నిర్వహిస్తామని ఆయన అన్నారు ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారు నేను చేస్తున్న సేవలను గుర్తించి నాకు గౌరవనీయులైన దాశరథి కృష్ణమాచార్య డాక్టర్ సి.నారాయణరెడ్డి సంయుక్త అవార్డును ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.