జనంన్యూస్. 22.నిజామాబాదు. ప్రతినిధి..
నిజామాబాదు.భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా నూతన జిల్లా కమిటీ విస్తరణలో భాగంగా జిల్లా ప్రధానకార్యదర్శిగా నాగోళ్ళ లక్ష్మీనారాయణ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.గత 28 ఎళ్లుగా పార్టీలో బూత్ అధ్యక్షుడి స్థాయి నుండి నిబద్దతతో చురుకుగా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు గుర్తించిన అధిష్టానం మరొక్కసారి జిల్లా కమిటీలో క్రియాశీలక బాధ్యతను కట్టబెట్టడం జరిగింది.1997 లో మొదలైన అయన ప్రస్థానం బూత్ అధ్యక్షుడిగా మొదలుపెట్టి పార్టీ కార్యక్రమలలో చురుగ్గా పని చేస్తూ బీజేపీ నగర యూవ మోర్చా నగర ఉపాధ్యక్షులు గా, బీజేపీ నగర ఉపాధ్యక్షులుగా, రెండు పర్యాయలు మండలం అధ్యక్షులు గా,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులుగా, బీజేపీ అర్బన్ అసంబ్లీ కోర్డినేటర్,గా పనిచేసారు.ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ మాట్లాడుతూ తన పైన నమ్మకంతో ఇందూరు జిల్లా కమిటీలో స్థానం కల్పించినందుకు ఎంపీ అరవింద్ ధర్మపురి కి, అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కు,జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి కి, మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి కి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. పార్టీ బలోపేతానికి పార్టీ ఎదుగుదలకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ పైన కాషాయ జెండా ఎగురావేయడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు.నాగోల్ల లక్ష్మీనారాయణ ఎన్నికపై నగరంలో పలువురు నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.