జనం న్యూస్ ఆగస్టు 22,అచ్యుతాపురం:
ముఠా కార్మికుల జిల్లా మహాసభలు మొట్ట మొదటిసారిగా ఈనెల 26వ తేదీ మంగళవారం నాడు అచ్యుతాపురంలో జరుగుతున్నాయని, ఈ మహాసభల్లో జిల్లాలో ఉన్న ముఠా కార్మిక నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని ముఠా సంఘం అధ్యక్షులు ఆర్ రాము కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఠా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్య చరణ రూపొందిస్తారని,ముఠా కార్మికులకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకార అందడం లేదని,ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేసి ఈఎస్ఐ,పీఎఫ్, పింఛన్ సౌకర్యం కల్పించి ముఠా కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లాలం నరసింగరావు,రాజాన సత్తిబాబు,వాసు, తాతారావు,శంకర్రావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.