శాంతి కమిటీ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్ పాపన్నపేట
ఆగస్ట్. 22 (జనంన్యూస్)
మండలంలో గణేష్ ఉత్సవాలు, మిలాన్ ఉన్ నబీ వేడుకలను ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. వినాయక మండప నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. వేడుకల్లో అన్నీ వర్గాలు, మతాల ప్రజలు పరస్పర సహకారం, సోదర భావంతో వ్యవహరించుకోవాలని సూచించారు. నవరాత్రి వేడుకలకు పోలీసు శాఖ పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపడుతుందని ఆయన పేర్కొన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసు శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్, స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్, ఇరువర్గాల మత పెద్దలు, ఆయా గ్రామాల్లోని మండపాల నిర్వాహకులు, ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు.