
పాపన్నపేట ఆగస్ట్. 22 (జనంన్యూస్)
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఎస్సై శ్రీనివాస్ గౌడ్ అన్నారు.వనమహోత్సవంలో భాగంగా శుక్రవారం పోలీస్ స్టేషన్ లో సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.మొక్కలు నాటి వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందన్నారు.ఏఎస్సై దేవీదాస్, కానిస్టేబుళ్లు శివకుమార్, వసంత్, నానుసింగ్, నర్సింలు, నాగలక్ష్మీ, తదితరులున్నారు.