
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
భారతీయ జనతా పార్టీ అన్నపురెడ్డి వెంకటేశ్వర్లు ఓబీసీ మోర్చా.
భారతదేశంలో బ్రిటీష్ దురహంకార పాలన నుండి దేశ స్వాతంత్ర్య పోరాట సమయం లో ఎందరో పోరాట యోధుల బలిదానాలు ఆత్మర్పణలు త్యాగాలు పోరాట ప్రటిమలును బుర్రకథలు తోలుబొమ్మలాటలు
గంగ్రెద్దుల ఆటలు పాటలు హారికథలు డప్పు వాధ్యాలు మొదలైన కళలతో నైతికత, జాతీయ సాంస్కృతిక తో వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలు ఊరు ఉరా సంచరిస్తూ దేశ ప్రజలకు వివిధ కళల రూపంలో ప్రదర్శిస్తూ… ప్రజలలో ఆనందాన్ని కలిగిస్తూ, స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని నింపుతూ జాతీయతా భావాలు పెంపోందిస్తూ స్వాతంత్ర్య పోరాట సమిధులై బ్రిటీష్ దురహంకార చర్యలకు గురి అయి బ్రిటీష్ వారి పాలనలో దేశద్రోహులు గా, నేరస్తులు గా ముద్రించబడి జైలు పాలయి అనేక విధాలుగా శిక్షిచబడిన జాతి ఈ సంచార, అర్ద సంచార జాతి. యుద్ధ తంత్రాలలో నేర్పరులై రాచరికపు రాజ ప్రసాధాలలో యుద్ధ తంత్రాలు పై శిక్షణ నిచ్చు ఈ సంచార యోధులు , భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలకు సారదులైన ఈ జాతులు స్వాతంత్ర్య సముపార్జన తరువాత కూడా ఏ విధమైన ఆలనా, పాలన, అభివృద్ధికి నోచుకోకుండా నేటి భారతీయ సమాజంలో నేటికీ కూడా వివక్షతకు గురి ఆగుతూ అభివృదికి ఆమడ దూరం లో విసిరి వేయబడుతున్నారు.వాస్తవానికి ట్రైబల్ వర్గానికి చెంది ఎస్ టి జాబితాలో భారత దేశంలో నివసించావాల్సిన ఈ సంచార అర్ద సంచార జాతులను ఆనాటి పాలకులు బీసీ వర్గం లో కేటాయించి దేశ సంస్కృతీ సాంప్రదాయాలకు వారసులైన ఈ జాతులను నిర్లక్ష్యం చేసినారు, ఆ తరువాత కాలం లో కూడా దేశ పాలకులలో ఎవరు కూడా ఈ జాతుల వారి పై ఆలోచించలేదు. భారతీయ జనతా పార్టీ లో వాజ్ పాయ్ గారు మొట్టమొదటి సారిగా ఈ జాతులపై ఆలోచించి, వీరి జనాభా సేకరణ చేపట్టించి,వీరి అభివృద్ధికి ప్రణాళికలు ఏర్పాటుకు అడుగులు వేశారు, వాజపాయ్ అనంతరం నరేంద్ర మోడీ ఈ జాతుల పై ప్రత్యేక శ్రద్ధ తో వీరిని అత్యంత వెనుకబడిన బీసీ వర్గాలు గా ఏర్పాటు చేయించి బీసీ కమీషన్ ను కూడా ఏర్పాటు చేయించారు. అంతే కాకుండా కేంద్ర మంత్రి వర్గం లో కూడా బీసీ వర్గాలలో వివిధ కులాల వారీగా మంత్రి పదవులు కల్పించారు, జాతీయ స్థాయి లో ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు కల్పించారు. సీడ్ పథకం ఏర్పాటు చేయించి వీరికి ప్రత్యేకం గా నిధులు ఏర్పాటుచేసి రుణాలు ఇప్పించారు. బీసీ ల రాజ్యాధికార ఆకాంక్షలను నరేంద్ర మోడీ నెరవేరుస్తూ అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రోత్సహిస్తున్నారు.నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు pvn మాధవ్ వాజ్ పాయ్ మోడీ స్ఫూర్తి తో సంచార, అర్ధసంచార జాతులపై ప్రత్యేక శ్రద్ధతో వీరి అభివృద్ధికి, రాజ్యాధికారానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గోపి శ్రీనివాస్ నేత్రుత్వం లో సంచార, అర్ద సంచార జాతులను ఏకం చేయిస్తూ, వారిలో అభివృద్ధి మార్గాల పై అవగాహన కల్పిస్తూ, వారికి ఏమి కావాలో అడిగి తెలుసుకుంటూ, వారి అభివృద్ధికి, వారి రాజ్యాధికార ఆకాంక్షలు నెరవేర్చుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 ఆగష్టు 2025 న విజయవాడలో , ది వెన్యూ ఫంక్షన్ హాల్ వద్ద.. స్ఫూర్తి… అను నామం తో సంచార అర్ద సంచార జాతుల వారి వృత్తులైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలైన వివిధ కళలు ప్రదర్శింపచేస్తూ వారికి రి్వార్డులు అవ్వార్డులు ప్రధానం చేయుటకు, సంచార అర్ద సంచార జాతుల వారి అభివృద్ధికి కృషి చేస్తున్న ఈ స్ఫూర్తి సభను సంచార, అర్ద సంచార జాతులు, బీసీ వర్గాల వారు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని కోరుతూ pvn మాధవ్ సంచార అర్ద జాతులను, బీసీ వర్గాలను స్ఫూర్తి అను ఈ అభివృద్ధి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు.ఈ కార్యక్రమం గురించి సంచార అర్ద సంచార జాతులకు వివరిస్తూ అవగాహన కల్పిస్తూ చిలకలూరిపేట లో..ఎన్టీఆర్ నగర్ లో ఉన్న సంచార జాతుల వారిని, మరియు కోండ్రు పాడు లో నివసిస్తున్న అర్ద సంచార జాతుల వారిని కలిసి వారికీ అవగాహన కల్పించి 30 వ తేదీ జరుగు స్ఫూర్తి సభకు హ్వానించటం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నపురెడ్డి వెంకటేశ్వలు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురు స్వామి, అసెంబ్లీ కన్వీనర్ తాడిపర్తి జయరామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షలు మల్లెల శివ నాగేశ్వరావు, జిల్లా కార్యదర్శి గట్టా హేమ, పట్టణ మాజీ అధ్యక్షులు బ్రాహ్మం, బీజేవైఎం నాయకులు పులుగుజ్జు మహేష్, కోటేశ్వరావు, నాదెండ్ల మండల మాజీ అధ్యక్షులు శివకోటిరెడ్డి తది తరులు పాల్గొన్నారు. ఆదిమూలం గురుస్వామి జిల్లా ప్రధానకార్యదర్శి ఓబీసీ మోర్చా, పల్నాడు జిల్లా