
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
అన్నమయ్య జిల్లాలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎం.పీ రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు మేడా రఘునాథ రెడ్డి రాజంపేట మండల పరిధిలోని బాలరాజుపల్లి లో చెయ్యేరు నదిలో 8 మంది విద్యార్థులు ఈతకు వెళ్లగా, ముగ్గురు ఇసుక ఊబిలో చిక్కుకుని మృతి చెందడం అత్యంత దురదృష్టకరమని ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు ఎం.పీ మేడా రఘునాథ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మృతి చెందిన ఒక కుటుంబానికి 50,000/- రూపాయలు నా వంతు సహాయంగా అందిస్తున్నాను, ప్రస్తుతం భారీ వర్షాలతో చెరువులు, కాలువలు, నదులు, జలాశయాలు ఉప్పొంగి ప్రవహిస్తున్న క్రమంలో.చిన్నారులు విద్యార్థులు,యువత మరింత అప్రమత్తంగా వ్యవహరిం చాలని కోరుతూ,విద్యార్థులు, ప్రభుత్వం అనుమతిస్తే రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండ లాలలో ప్రభుత్వ భూమి లో ఈత నేర్చు కోవడానికి ఎంపీ నిధులతో లేదా సొంత నిధులతో స్విమ్మింగ్ పుల్ (ఈత కొలను) నిర్మిస్తానని, యువత.సరదా,ఆకతాయిగా చేసే చర్యలు తల్లిదండ్రులకు తీరని కడుపు కోతను మిగులుస్తాయని రాజ్యసభ యం.పి మేడా రఘునాథ రెడ్డి అన్నారు.