
ఎంపీడీఓ శ్రీనివాసులు,
జనం న్యూస్,ఆగస్ట్ 22,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని రాజారామ్ తాండ గ్రామ పంచాయతీలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనుల జాతరలో మండల అధికారి ఎంపీడీఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీడీవో పంటభివృద్ధి,భూసంరక్షణ,పర్యావరణ పరిరక్షణ,వ్యవసాయ క్షేత్రంనికి వెళ్లే రహదారులకు కలవట్లు, క్యాటలిన్ షెడ్డులు, బర్రెలా షెడ్డులు,గోర్ల మేకల షెడ్డులు,వంటల పై గ్రామస్తులకు వివరించారు. ప్రజలందరూ ఈ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ నర్సిములు,టీఏ దశరథ్,పంచాయతీ కార్యదర్శి రాజు పవార్, గ్రామ తాజా మాజీ సర్పంచ్,పల్లవి పర్సురాం,మాజీ సర్పంచ్ ఖిరు నాయక్, మాజీ ఎంపీటీసీ సాలిబాయి గంగారాం, రవీందర్ డీలర్, అధ్యక్షులు జాదవ్ జీవన్,రాంకీషన్, మణిరం,మోతిలాల్, బాబూషింగ్,శంకర్, గోపాల్,అంబర్ షింగ్, గ్రామ పెద్దలు, పాల్గొన్నారు.