
జనం న్యూస్,ఆగస్టు22,మునగపాక:
యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం మునగపాక బొడ్డేడ ప్రసాద్ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ సదరం సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ పేరిట కూటమి ప్రభుత్వం లక్ష మంది దివ్యాంగుల పెన్షన్ రద్దు చేసింది,కలెక్టరేట్ చూట్టూ దివ్యాంగుల నిరసన వ్యక్తం చేస్తున్నారని పింఛన్ తొలగించారన్న మనోవేదనతో మనస్థాపానికి గురవుతున్నారని ప్రభుత్వానికి దివ్యాంగుల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందని,అలాగే దివ్యాంగుల పెన్షన్ సమస్యపై త్వరలోనే ధర్నా నిరసన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు గణపతి ఆచ్చినాయుడు, మండలం ప్రజా ప్రతినిధులు,సర్పంచ్లు ఎంపీటీసీలు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.