
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 23 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం పట్టణం 2వ పట్టణ పోలీసు స్టేషనులో 2015 సం.లో నమోదైన హత్య కేసులో నిందితురాలు
(ఎ-2) భీమిలి మండలం నగరపాలెం గ్రామానికి చెందిన గారి వెంకట జ్యోతిర్మయి (34 సం.లు) కు జీవిత ఖైదు, (ఎ-3) భీమిలి మండలం కాపుల దిబ్బవాని పాలెం గ్రామానికి చెందిన చొక్కా నరేష్ (42 సం.లు) మరియు (ఎ-4) భీముని మండలం ఉప్పాడ గ్రామానికి చెందిన పాడ రాజు అలియాస్ ముక్కు (38 సం.లు) అనే మరో ఇద్దరు నిందితులకు 7సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.500/- జరిమానగా విధిస్తూ విజయనగరం ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి బి.అప్పలస్వామి తీర్పు వెల్లడించినట్లుగా ఆగస్టు 22న జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే.. భీమిలి మండలం నగరపాలెం గ్రామానికి చెందిన జి. వెంకట జ్యోతిర్మయి (34 సం.లు)కు రమేష్ అనే వ్యక్తితో వివాహం అయ్యి, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలరు. వీరు ఆనందపురం మండలం బొడ్డుపాలెం గ్రామంలో నివాసం ఉండేవారన్నారు. ఈ క్రమంలో భర్త గార రమేష్ కు సీ-మెన్ గా ఉద్యోగం రావడంతో, శిక్షణ నిమిత్తం 2015 సం.లో శిక్షణకు చెన్నై వెళ్ళిపోగా, గార వెంకట జ్యోతిర్మయికి (ఎ-1) భీమిలి మండలం కాపుల దిబ్బవానిపాలెం గ్రామానికి చెందిన రాగాతి రాము (33సం.లు) అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, ఇరువురి మధ్య అక్రమ సంబంధం ఏర్పడిందన్నారు. భర్త గార రమేష్ శిక్షణ పూర్తి చేసుకొని చెన్నయ్ నుండి వచ్చిన తరువాత, తన భార్య జ్యోతిర్మయికి రాగాతి రాముతో అక్రమ సంబంధం ఉన్నట్లుగా గుర్తించి, ఆమెను ప్రశ్నించేవాడన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవలు జరుగుతుండేవని, తన భర్త అడ్డు తొలగించు కొనేందుకుగాను నిందితులు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారన్నారు. తే.26-07-2015 దిన రమేష్ (మృతుడు) తన భార్య వెంకట జ్యోతిర్మయి (ఎ-2)ను ఇదే విషయమై ప్రశ్నించగా, జ్యోతిర్మయి తన ప్రియుడు రాగాతి రాముకు ఫోను చెయ్యగా, రాము వచ్చి, జ్యోతిర్మయి అందించిన తలుపు చెక్కతో రమేష్ తలపై కొట్టగా, తలకు తీవ్రమైన గాయమై, రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. ఈ విషయంను జ్యోతిర్మయి రెండవ కుమార్తె సౌమ్య (6సం.లు) చూడడం జరిగిందన్నారు. (ఎ-1)
రాగాతి రాము, (ఎ-2) జ్యోతిర్మయి (ఎ-3) చొక్క నరేష్ మరియు (ఎ-4) రాజు లతో కలసి రమేష్ మృత దేహాన్ని అర్ధ రాత్రి సమయంలో భీమిలి బీచు తీసుకొని వెళ్ళి, బాడీపై పెట్రోల్ పోసి, కాల్చేయడం జరిగిందన్నారు. అనంతరం, వారు తిరిగి ఇంటికి వచ్చి విషయం తన రెండవ కుమార్తె సౌమ్య (6సం.లు) తో బయటపడుతుందని భావించి, ఆమెను విజయనగరం పూల్ బాగ్ తీసుకొని వచ్చి, నిర్మానుష్యంగా ఉన్న ఒక బావిలో పదేసి, చంపేయడం జరిగిందన్నారు. ఈ విషయమై 2వ పట్టణ పోలీసులకు తెలిసి, కేసు నమోదు చేసి, విచారణ చేపట్టి, వాస్తవాలను వెలికితీసి, నిందితులు నలుగురిని అప్పటి 2వ పట్టణ సిఐ అంబేద్కర్ అరెస్టు చేసి, రిమాండుకు తరలించారన్నారు. అనంతరం, ఈ కేసును తరువాత బాధ్యతలు చేపట్టిన సిఐలు జి.దుర్గా ప్రసాద్, ఎన్.హెచ్. విజయ ఆనంద్, కే. రామారావు దర్యాప్తు చేసి, నిందితులపై న్యాయస్ధానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. అనంతరం, కేసులో ప్రాసిక్యూషను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రస్తుత సిఐ టి.శ్రీనివాసరావు ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తూ, న్యాయస్థానంలో సాక్ష్యాలను ప్రవేశ
పెట్టడం, నిందితులపై నేరం రుజువు కావడంతో నిందితురాలు (ఎ-2) భీమిలి మండలం నగరపాలెం గ్రామానికి చెందిన గారి వెంకట జ్యోతిర్మయి (34సం.లు)కు జీవిత ఖైదు, (ఎ-3) భీమిలి మండలం కాపుల దిబ్బవాని పాలెం గ్రామానికి చెందిన చొక్కా నరేష్ (42 సం.లు) మరియు (ఎ-4) భీముని మండలంఉప్పాడ గ్రామానికి చెందిన పొడ రాజు అలియాస్ ముక్కు (38 సం.లు) అనే ఇద్దరు నిందితులకు 7సం.లు కఠిన కారాగార శిక్ష, రూ.500/- జరిమానగా విధిస్తూ విజయనగరం ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయమూర్తి బి.అప్పలస్వామి తీర్పు వెల్లడించినట్లుగా ఆగస్టు 21న జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన (ఎ-1) రాగాతి రాము విచారణ సమయంలో రహదారి ప్రమాదంలో మరణించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో నిందితులు శిక్షింపబడే విధంగా చర్యలు చేపట్టిన పబ్లిక్ ప్రాసిక్యూటరు వి.రఘురాం పోలీసుల తరుపున వాదనలు వినిపించగా, విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాసరావు, కోర్టు కానిస్టేబులు టి.లక్ష్మి, సి.ఎం.ఎస్. ఎఎస్ఐ పి.మల్లేశ్వరరావులను క్రియాశీలకంగా పని చేసారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.