
-విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు పిలుపు
జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
రాజమహేంద్రవరం, ఆగస్టు 23: వచ్చేనెల ఒకటో తేదీన జిల్లాలో ప్రారంభం కానున్న రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ సారథ్యం పేరిట పర్యటన నేపథ్యంలో కార్యకర్తలను సమాయాత్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ కాతేరు పంచాయతీ పరిధిలోని శాంతినగర్ లో, అచ్చుల కళ్యాణ్ మండపంలో 1వ మండల అధ్యక్షులు నాగల శివ కుమార్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని పోలింగ్ బూత్, కార్యకర్తలతో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు సమావేశమయ్యారు. అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి పలు సూచనలు చేశారు. సోము మాట్లాడుతూ కష్టపడే కార్యకర్తలకు పార్టీలు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కో కన్వీనర్,యానాపు ఏసు , జిల్లా ఉపాధ్యక్షులు బండి ప్రసాద్, స్వామి సూర్యకిరణ్ , పడాల హత్తిరామ్, కాలెపు సత్య సాయిరాం, మండల జనరల్ సెక్రెటరీ సురేష్ , ఆకుల నరసవేని, విపత్తు జ్యోతి, రాయుడు సత్యనారాయణ, సోము సతీష్, దంటు సత్యనారా యణ, ఉందుర్తి సుషేశ్వరరావు, పోసుపో విజయరావు, అడపాక నాగమణి, మల్లివలస రాంబాబు, పి నాగేశ్వరావు కే రాజు, పి రవి, శ్రీనివాస్, పొడి చంటి, పిన్నమరెడ్డి నారాయణ రావు, ఇప్పర్తి జ్యోతి, కండిల్ల రామారావు, మండలంలోని అన్ని గ్రామాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
