ఎస్ ఆర్ డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్
జనం న్యూస్,జనవరి 27,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలోని సంగారెడ్డి జిల్లా మాదిగ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు ఎం విజయ్ కుమార్,జర్నలిస్టు మిత్రులతో కలిసి సోమవారం హార్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ఉద్యమ నేత మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడంపై మాదిగ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు.గత ముపై సంవత్సరాలుగా వెనుకబడిన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఖేడ్ నియోజకవర్గ ఎంజేఎఫ్ కన్వీనర్ బాబు మాదిగ, కంగ్టి మండల ఎమ్మార్పీఎస్ ప్రధాన కార్యదర్శి వైద్యనాథ్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.