
జనం న్యూస్ ఆగస్టు 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఈరోజు అల్లవరం మండల బిజెపి సమావేశం జిల్లా పూర్వ అధ్యక్షులు యాళ్ల దొరబాబు వారి సమక్షంలో వారి ఇంటి వద్ద మండల అధ్యక్షులు కట్టా నారాయణమూర్తి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో నాయకులు పాల్గొని సోమవారం రాష్ట్ర బిజెపి అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ కోనసీమ పర్యటనలో భాగంగా శోభాయాత్ర ర్యాలీని విజయవంతం చేయాలని నిర్ణయించారు ఈ సమావేశంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ జిల్లా ఉపాధ్యక్షులు అడపా శ్రీనివాసరావు జిల్లా సెక్రటరీ సత్యనారాయణ వర్మ కార్యవర్గ సభ్యులు సుంకర సాయి గూడాల పుల్లయ్య శెట్టి ,వార్డు సభ్యులు ఓలేటి పరమేశ్వర రావు అంగాని ధనుంజయ్ వర్మ కుడుపూడి దుర్గాప్రసాద్ కంకిపాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.