జనం న్యూస్ ఆగస్టు 23:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండల కేంద్రంలో వినాయక మండపాల షెడ్ల నిర్మాణం కోసం 17 ఫీట్లఇనుప స్టాండ్ కావాలని యూత్ సంఘాలు కోరడంతో శనివారం రోజునా గ్రామయూత్ సంఘాలకు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోళ్ళ శివకుమార్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోఎవరికైనా మండపాలషేడ్ల కొరకు స్టాండ్ అవసరము ఉంటుందో రాయల్ గాయ్స్ యూత్ వద్ద ఈ స్టాండ్ ఉంటుంది అవసరమున్నవారు ఉచితంగా వాడుకొని తిరిగి ఆ యూత్ కు అప్పగించవలెను అని మాట్లాడారు. అనంతరంస్టాండ్ వితరణ చేసినందుకుయూత్ సంఘాలు ఆదర్శ యూత్, సహృదయ యూత్,రాయల్ గాయ్స్ యూత్, యంగ్ ఫైర్స్ యూత్, శివాజీ గయ్స్ యూత్ ,వీ కింగ్స్ యూత్, రాయల్ ఫ్రెండ్స్ యూత్ సంఘాలు కృతజ్ఞతలు తెలిపి ఘనంగాసన్మానించారు.