ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఆగస్టు 23 :
ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని,పిఆర్సీ నివేదికను తెప్పించుకొని 1.7.2023 నుండి అమలు చేయాలని,బకాయిపడిన ఐదు డి.ఏ లను వెంటనే విడుదల చేయాలని, ఏకీకృత సర్వీస్ రూల్స్ రూపొందించి డీఈవో,డిప్యూటీ డిఈఓ,ఎంఈఓ,లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలని,ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని,పండిట్స్ పిఈటీ పోస్టులు అఫ్ గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పించాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,సిఆర్టి ల బకాయిలను వెంటనే చెల్లించాలని, కేజీబీవీ యుఆర్ఎస్ ల సమస్యలు పరిష్కరించి, సమ్మె కాలం వేతనాన్ని వెంటనే చెల్లించాలని,గురుకుల టైం టేబుల్ సవరించాలని,సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపియస్ విధానం అమలు చేయాలని,ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ శనివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్పిసి)ఆధ్వర్యంలో మహాధర్నా కార్యక్రమానికి ఏన్కూరు మండలం నుండి టీఎస్ యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి డిఎస్.నాగేశ్వరరావు నాయకత్వంలో మండలం నుండి టీఎస్ యుటిఎఫ్ నాయకులు భారీగా తరలి వెళ్ళారు.మండల అధ్యక్షులు బి.రాంచంద్, ప్రధాన కార్యదర్శి మూడ్ పుల్లయ్య,మండల నాయకులు బి.శ్యామ్ కుమార్,బి.సింగ్యా,రమేష్, మురళీ మోహన్ కృష్ణారావు మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.