ఆగస్టు23 ( జనం న్యూస్)
:మండల కేంద్రమైన పాపన్నపేట ఈశ్వరాలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు వరలక్ష్మీ వ్రత పూజలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చెర్వుపల్లి విశ్వనాథ శర్మ ఆధ్వర్యంలో ఉదయాన్నే కుంకుమార్చన,అభిషేకం పూజలు జరిపారు.పూజ కార్యక్రమం పాపన్నపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు గజావాడ రాజేశ్వర్ గుప్తా,బెజుగం విట్టలేశ్వర్ గుప్తా,మహిళా సంఘం నాయకురాలు గజవాడ రమాదేవి,బెజుగం రజని,పత్తి మంజుల తదితరులు పాల్గొన్నారు.