జనం న్యూస్ ఆగష్టు 24(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )
మునగాల మండలం రేపాల గ్రామం నుండి మాధవరం మరియు రేపాల గ్రామం నుండి కలకోవా డొంక మార్గాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కీ రేపాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ సర్పంచ్ బెజవాడ కృష్ణయ్య వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని అతి త్వరలో సంబంధిత అధికారులతో చర్చించి,రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారని తెలియజేశారు. అలాగే రేపాల గ్రామంలో నెలకొని ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినట్లు కృష్ణయ్య తెలియజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యేకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.