వందలాది ట్రాక్టర్ల ఇసుక వినియోగం యథేచ్చగా కొనసాగుతున్న యూనిట్లు పట్టించుకోని మైనింగ్ అధికారులు సర్కారు ఆదాయానికి తూట్లు
జనం న్యూస్ జనవరి 27 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- కొమురం భీం,ఆసిఫాబాద్ జిల్లాలో సిమెంట్ ఇటుకల తయారీలో అక్రమంగా ఇసుకను వినియోగిస్తున్నట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. జిల్లాలో ఎటువంటి ఇసుక రీచ్లు లేకపోవడంతో సిమెంట్ ఇటుకల తయారీ వినియోగించే ఇసుకను సమీపంలోని ఉ న్నటువంటి వాగులు, ఓర్రెల నుండి ఇసుక అక్రమంగా సేకరించి ఉపయోగిస్తున్నారు. అక్రమ ఇసుక తరలింపుపై వివిధ పత్రికలలో వార్తలు రావడంతో రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ, పోలీసులు ఆయా ప్రాంతాలలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని జరిమానాలు విధిస్తున్నారు. తాత్కాలికంగా కొన్ని రోజులపాటు హడావుడి చేసే అధికారులు అ తరువాత ఇసుక అక్రమ రవాణాపై నిర్లక్ష్యం చేస్తున్నారు.ఇసుక రవాణాపై పలుమార్లు వార్తలు రావడంతో అధికారులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్క ట్రాక్టర్కు రూపాయలు 1800 చెల్లించి ఇసుకను తీసుకువెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా కొన్ని రోజులపాటు జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కొన్ని ట్రాక్టర్లకు రుసుము చెల్లించి ఇసుకను తీసుకు వెళు తున్నారు. అధికారుల హడావుడి తగ్గిన తర్వాత యధావిధిగానే ప్రభుత్వానికి ఎటువంటి రుసుములు చెల్లించకుండానే వందలాది ట్రాక్టర్ల ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుకను సేకరించి నిలువ చేసుకొని సిమెంట్ ఇటుకల తయారీలో వినియోగిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి లక్షల రూపాయలు గండి కొడుతున్నారు. సిమెంట్ ఇటుకల తయారీలో...
వినియోగిస్తున్న ఇసుక అక్రమంగా సేకరిస్తున్న విషయం బహిరంగ రహస్యమేనని తెలుస్తుంది. అప్పుడప్పుడు అక్రమ
రవాణాపై ఎవరైనా రెవెన్యూ,భూగర్భ గనుల శాఖ,పోలీస్ శాఖకు ఫిర్యాదు చేస్తే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకొని జరిమానాలు విధిస్తున్నారు.తాత్కాలికంగా జరిమానాలు చెల్లించి ఇసుక అక్రమ రవాణా
దారులు తిరిగి యధావిధి గానే తమ దందాను కొనసాగిస్తున్నారు.జిల్లాలో పదుల సంఖ్యలో సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు విచ్చలవిడిగా అక్రమంగా ఇసుకను సేకరిస్తుండడంతో ఇటుక
తయారీ యూనిట్ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేసింది లేదు అక్రమ
ఇసుక నిల్వ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నది లేదు. దీంతో
ఇసుక అక్రమ రవాణా సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లకు,భారీ స్థాయిలో చేరుతున్నాది. ఈ అక్రమాలపై పోలీస్, రెవెన్యూ,భూగర్భ గనుల శాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపడితేనే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిని నిరోధించవచ్చు.సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లను ఆకస్మిక తనిఖీలు చేపడితే మరిన్ని అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉన్నదని,తెలుస్తుంది. జిల్లాలో కొనసాగుతున్న సిమెంట్ ఇటుక తయారీ యూనిట్లు పూర్తిస్థాయిలో నిబంధనలకు విరుద్ధంగా
కొనసాగుతున్న సంబంధిత శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్ర విమర్శలు.వెలువడుతున్నాయి.