భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 23 ( జనం న్యూస్)
కూకట్పల్లి లో 10 సంవత్సరాల సహస్ర అనే చిన్నారిని అమానుషంగా హత్య చేసిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్భయ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు, న్యాయవాది మల్లెల ఉషారాణి మాట్లాడుతూ, ఈ దారుణానికి పాల్పడిన బాలుడిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి కేసులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
“ఐదు రోజులుగా తెలంగాణ ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ఈ సంఘటనలో నిందితుడు బ్యాట్ కోసం వెళ్లాను అనే పేరుతో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడం ద్వారానే సమాజానికి బలమైన సందేశం వెళుతుంది,” అని ఆమె తెలిపారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనను చిన్నప్పటి నుండి గమనిస్తూ, వారు ఫోన్ల వినియోగం, స్కూల్ మరియు సమాజంలో ఎలా ఉంటున్నారో క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. “పిల్లలను కష్టపడి చదివించి మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకునేలా తీర్చిదిద్దకపోతే, ఇటువంటి ఘటనలకు పాల్పడే ప్రమాదం ఉంది,” అని ఉషారాణి హెచ్చరించారు