బిచ్కుంద ఆగస్టు 23 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం ఖత్గావ్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ 108 మల్లికార్జున్ శివచార్య స్వామి గారి మాతృమూర్తి బుధవారం రోజున పరమపదించడం జరిగింది.విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారు ఖత్గావ్ గ్రామానికి వెళ్లి మాతృమూర్తి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు..ఈ కార్యక్రమం లో బిచ్కుంద మాజీ మార్కెట్ చైర్మన్ నాల్చర్ రాజు, సంతోష్ రెడ్డి, తుకారాం రెడ్డి, మాణిక్ పటేల్, లక్ష్మణ్ పటేల్, గంగు పటేల్, రమేష్, ముసద్, చాకలి రమేష్, నాగ్ నాథ్ సెట్, బస్వారాజ్ పటేల్, డాక్టర్ రాజు, దేవడా శివనాధ్ అప్ప తదితరులు పాల్గొన్నారు.