జనం న్యూస్ ఆగష్టు 23 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
తథాగత్ భగవాన్ బుద్ధులవారు చూపించిన పంచశీల మార్గాలను ఆచరించిన ప్రతి ఒక్కరిని ఉన్నత స్థానానికి చేరుతుందని నిజామాబాద్ కు చెందిన బౌద్ధ గురూ బంతే బుద్ధ శరన్ అన్నారు. శనివారం వాంకిడి మండల కేంద్రంలోని భీమ్ నగర్ లో నిర్వహించిన సామాజిక కార్యక్రమంలో పాల్గొని ఆయన బుద్ధిని శీలమార్గాలను ప్రబోధించారు. నేటి ఆధునిక ప్రపంచంలో మనిషి అనేక ఒత్తిడిలకు గురవుతున్న సందర్భంగా శీలమార్గాలను పాటించడం వల్ల ఒత్తిడి దూరమై ప్రశాంత జీవనం కలుగుతుందని ఆయన అన్నారు. పంచశీలలు పాటించిన వ్యక్తి నడుస్తుంటే పంచభూతాలు దిక్కుల నుండి సైతం స్వాగతం పలుకుతాయని, కరుణ, దయ, వాత్సల్యం , లాంటివి నేటి గజిబిజి ప్రపంచంలో మనిషి నుండి దూరమైనాయని వాటిని తిరిగి పొందగలిగితే జీవితం సాఫల్యం అవుతుందా జీవితం సాఫల్యం అవుతుందని బోధించారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహుల్కర్ (అశోక్ బోధి), భౌద్ద చారులు సఖ్య మహా కషప్,చైతన్య బోధి,రామ బాయి మహిళా మండలి అధ్యక్షురాలు గంగు బాయి కోబ్రగడే, అంబేడ్కర్ సంఘం నాయకులు అరుణ్ కుమార్,మహిళా మండలి జిల్లా కార్యదర్శి వాణి, సభ్యులు జ్యోతి తదితరులు పాల్గొన్నారు.