
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 24
తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం బాలరాజు అధ్యక్షతన చదువు ప్రాముఖ్యత పైన అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్ని సేవాసంస్థ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ క్రమ శిక్షణతో ఒక లక్ష్యంతో చదవాలి అని అన్నారు అలాగే చదువు ఉన్నతస్థాయి చేరుస్తుంది అని అన్నారు చదువు ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు విద్యార్థులు అందరూ ఫోన్ కు దూరంగా ఉండాలి అని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం బాలరాజు మాట్లాడుతూ విద్యార్థులు అందరూ మంచి పవర్తన కలిగి ఉన్నత లక్ష్య సాధన కోసం కష్టపడి చదవి మంచి భవిష్యత్తు కలిగి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకోని రావాలి అన్నారు అలాగే ఉపాధ్యాయులు ముందు ఉండి విద్యార్థులను నడిపించుకు కృత నిశ్చయంతో ఉన్నారు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ఓ రవి శేఖర్ రెడ్డి మాట్లాడుతూ స్పేస్ గురించి విద్యార్థులకు వివరించారు విద్యార్థులకు కష్టపడి చదివే అలవాటు పెంపోదించుటకు విద్యార్థులు చేత ప్రతిజ్ఞ చేయించారు సొసైటి సభ్యుడు మహేష్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువంకోనుటకు అన్నివిధాల ప్రధానోపాధ్యాయులు సహకారం లభిస్తుంది అని ఉపాధ్యాయుల సహకారాన్ని అందిచేందుకు కృషి చేస్తారు అని తెలియజేశారు ఈ సందర్భంగా చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ సొసైటి అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం బాలరాజు చిన్ని సేవా సంస్థ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ సోసైటి సభ్యుడు మహేష్ నాయక్ ఉపాధ్యాయులు కోటి మోహన్ నరసింహారావు హేమలత రాజ శేఖర్ రెడ్డి రమేష్ బాబు కిషోర్ బ్రహ్మం పాల్గొన్నారు