
జనం న్యూస్ ఆగష్టు 25 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రం నుండి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఉద్దేశంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట లో ఏర్పాటు చేసిన రెండవ విడత జనహిత పాద యాత్రకు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు తరలి వెళ్లారు. ఈ యాత్రలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. వెళ్లిన వారిలోమారపల్లి రవీందర్, వైనాల కుమారస్వామి, చింతల రవిపాల్, శానం కుమారస్వామి, మారపల్లి వరదరాజు, కట్టయ్య, పల్లెబోయిన శ్రీనివాస్, జగన్, తక్కల్ల సాంబయ్య, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు….