
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
వినాయక చవితి పండుగను దృష్టిలో ఉంచుకొని ఈరోజు రాజంపేట రూరల్ సీఐ బివి రమణ ఆధ్వర్యంలో నందలూరు పోలీస్ స్టేషన్ ఆవరణ నందు పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది, రాబోవు వినాయక చవితి పండుగను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భక్తి భావంతో పండుగ జరుపుకోవాలని కమిటీ సభ్యులను ఉద్దేశించి సిఐ తెలపడ మైనది, ఈ కార్యక్రమంలో నందలూరు ఎస్సై మల్లికార్జున రెడ్డి, నందలూరు ఎలక్ట్రికల్ ఏ,ఈ సుబ్రమణ్యం ,ముస్లిం మత పెద్దలు మరియు అన్ని గ్రామాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొనడం అయినది.