జనంన్యూస్. 28. నిజామాబాదు. ప్రతినిధి.:- అప్లై చేసుకున్న 3 నెలలోపు చెక్కులు వచ్చే విదంగా కృషి చేసిన ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలుపుతు హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తం ఖర్చులో 50% లబ్ధిదారులకు చెల్లించాలని అసెంబ్లీలో డిమాండ్ చేస్తా - అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ ఇందూర్ నగరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నీది ధ్వరా 103మందికి 29,64,524 రూపాల విలువ గల చెక్కులు అందించడం జరిగిందన్నారు... ఇప్పటివరకు ఎక్కువ మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్బన్ నియోజకవర్గనికి రావడం జరిగిందని అన్నారు ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సెక్రటరేట్ కి పంపించడం జరుగుతుందని అన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు అప్లై చేసుకున్న మొత్తంలో 15%, 20% మాత్రమే చెల్లిస్తుందని లక్షల్లో ఖర్చు ఉంటే 15వేలు, 20వేలు ఇస్తే సామాన్యులకు చికిత్స ఖర్చు ఆర్ధిక భారంగా మారుతుందని అన్నారు.. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఎంఆర్ఎఫ్ అప్లై చేసుకున్న మొత్తంలో 50% ప్రభుత్వం చెల్లించేలే డిమాండ్ చేస్తానని తెలియజేసారు.. గత ఎమ్మెల్యే హయాంలో సంవత్సరాలు గసిన చెక్కులు రాలేదని ఇప్పుడు అప్లై చేసుకున్న 3 నెలలో చెక్కులు వచ్చేలా కృషి చేసిన ఎమ్మెల్యే గారికి లబ్ధిదారులు అందరు కృతజ్ఞతలు తెలిపి హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు,మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.