
జనం న్యూస్.ఆగస్టు25. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం పిలుపు మేరకు రేషన్ డీలర్లకు చెల్లించాల్సిన కమిషన్ నిధులను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం తాసిల్దార్ పర్వీన్ షేక్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు బేగరీ మల్లేశం మాట్లాడుతూ గత ఐదు నెలల నుండి రేషన్ డీలర్లకు రావాల్సిన కమిషన్ నిధులు రాకపోవడంతో అప్పులపాలై ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు ప్రతి నెల5000రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని అలాగే ప్రతి క్వింటల్ బియ్యం సంచికి 300రూపాయలు కమిషన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు. ఐదు నెలలు గడుస్తున్న ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.కమిషన్ నిధులతోపాటు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో.చెన్నా నరసింహులు అఫ్జల్ లింగం కే.నర్సింలు జహీర్ ఉద్దీన్ కృష్ణ పురుషోత్తం రామకృష్ణ మండలంలోని వివిధ గ్రామాల డీలర్లు పాల్గొన్నారు.
