
సమాచార హక్కు మానవహక్కు లా సమితి ఆధ్వర్యంలో నల్లగొండ కలెక్టర్ ఆదేశానుసారం అవగాహన కార్యక్రమం
జనం న్యూస్- ఆగస్టు 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ మరియు స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు సమాచార హక్కు మానవ హక్కు లా సమితి ఆధ్వర్యంలో తమను కోతులు కుక్కల దాడుల నుంచి రక్షించాలంటూ హిల్ కాలనీ మెయిన్ బజార్ నుంచి ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసు మరియు నందికొండ మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించి నందికొండ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ లో సెక్షన్ ఆఫీసర్ అనిత కు మరియు ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ సంగీత కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు మాట్లాడుతూ తాము స్కూలుకు వెళ్లి వచ్చే సమయాలలో కోతులు మరియు వీధి కుక్కలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని, తమ లంచ్ బాక్స్ లను ఎత్తుకెళ్తున్నాయని, కోతుల దాడిలో తమతోటి విద్యార్థులు సైతం గాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయని స్టడీ అవర్స్ సమయంలో కూడా కోతుల భయంతో తాము చదువు మీద శ్రద్ధ వహించలేకపోతున్నామని తెలిపారు, తల్లిదండ్రులు తమ వెంట ఉంటే గాని స్కూలుకి వెళ్లలేని పరిస్థితి ఉందని, వీరి కుక్కలను కోతులను సురక్షిత ప్రాంతాలకు తరలించి తమకు భద్రత కల్పించాలని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ ఆఫ్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాచార హక్కు మానవ హక్కు లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు కన్నె కంటి క్రాంతి కుమార్, శివ శంకరాచారి, నజీర్ పాషా, విజయ్, ఛత్రు నాయక్, దాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గోరంట్ల శివరాం ప్రసాద్, జి బద్రి, ఏ శ్రీనివాస్ ,శ్రీను తదితరులు పాల్గొన్నారు.
