
జనం న్యూస్ ఆగస్టు 25 ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ మండలంలో విజయవంతం చేయాలి వివోఏ ళకు మరియు మెప్మా ఆర్పీలకు ఒకరోజు శిక్షణ నిర్వహణ మండల విద్యాశాఖ అధికారి ఏ. శ్రీనివాస్ డిపార్ట్మెంట్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మరియు డిపార్ట్మెంట్ అఫ్ అడల్ట్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా NEW INDIA LITERACY PROGRAM లో భాగం గా ఉల్లాస్ ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం హాసనపర్తి మండల స్థాయి లో స్థానిక హాసనపర్తి బాలుర ఉన్నత పాఠశాలలో సోమవారం నాడు జరిగింది ఈ కార్యక్రమానికి నోడల్ ఆఫీసర్ గా వ్యవహారిస్తున్న మండల విద్యాశాఖాధికారి శ్రీ ఎ శ్రీనివాస్ గారు అధ్యక్ష ప్రసంగం చేస్తూ ఉల్లాస్ కార్యక్రమం విజయవంతం కావడానికి V. O. A/R.P లు ప్రముఖ పాత్ర పోషించాలని,మహిళలు తలుచుకుంటే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది అని వారికీ ప్రేరణ కలిగించారు ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా శ్రీ.శివప్రసాద్, శ్రీ మల్లేష్ గార్లు వ్యవహారించారు టౌన్ లిటరసీ మిషన్ కోఆర్డినేటర్ శ్రీ వెంకట్ రెడ్డి గారు, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ శ్రీ రమేష్, శ్రీ సునీల్ కుమార్ డి. ర్. డి. ఏ APO శ్రీ నారాయణ పాల్గొనడం జరిగింది
