
జిన్నారం సిఐ నయీమ్ ఉద్దీన్,
.హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి.
జనం న్యూస్. ఆగస్టు 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
వినాయక చవితి,మిలాద్ ఉన్ నబీ పండుగలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని జిన్నారం సిఐ నయీముద్దీన్, హత్నూర ఎస్ఐ శ్రీధర్ రెడ్డి అన్నారు. సోమవారం హత్నూర పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి మతపెద్దలు,వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ,ఎస్ఐ లు మాట్లాడుతూ. కుల మతాలకు అతీతంగా పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని.ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.వినాయక మండపాల వద్ద లైట్ల కోసం ఏర్పాటుచేసే విద్యుత్ తీగలతో తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో.శాంతయ్య. నాగ ప్రభు గౌడ్ బుచ్చేంద్ర మాదిగ.మహంకాళి నాగేష్. గంధగళ్ళ ప్రసాద్ గౌస్ పాషా ఖదీర్ అహ్మద్ హుస్సేన్ షారుల్లా సుధాకర్ ఎర్రోళ్ల నర్సింలు పొట్లగళ్ల రాములు పండుగ బాలకిషన్ మంగలి వెంకటయ్య వివిధ గ్రామాలకు చెందిన మత పెద్దలు,ఆయా పార్టీల నాయకులు,యువ జన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
