
పంపిణీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శెట్కార్ సీమ రమేష్ .
బిచ్కుంద ఆగస్టు 26 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ బిచ్కుంద మండల కేంద్రంలో బిచ్కుంద మున్సిపాలిటీలో ఉన్న కే.జీ.బీ.వీ బాలికల పాఠశాల లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయులు శెట్కార్ రమేష్ సెట్ గారి జ్ఞాపకార్థంతో విద్యార్థులకు పరీక్ష పాడ్లను కాంగ్రెస్ నాయకురాలు బిచ్కుంద మాజీ ఎంపీటీసీ షెట్కార్ సీమ రమేష్ అందజేశారు. ఈ సందర్భంగా శెట్కార్ సీమ రమేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని కోరారు. అలాగే ఏదైనా సమస్యలు ఉంటే విద్యార్థినులు తమ దృష్టికి తీసుకురావాలని, తాము తమ నాయకుడితో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపాల్ రాగిణి మరియు బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు శెట్కార్ సాహిల్ సెట్ , కేజీబీవీ అధ్యాపక బృందం విద్యార్థినిలు పాల్గొన్నారు

