
జనం న్యూస్ ఆగస్టు 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ .పోలవరం మండలం గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హైస్కూల్లో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయిరాం విద్యానికేతన్ కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ,కుత్రిమ రంగులు, రసాయనాలతో కూడిన విగ్రహాలను పూజించి చెరువులలో ,కాలువలలో నిమజ్జనం చేయడం వలన జల వనరులు కాలుష్యానికి గురవుతున్నాయని, తద్వారా జలాలలో నివసించే జీవుల మనుగడ కూడా కష్టం అవుతుంది .మట్టితో చేసిన విగ్రహాలను పూజించి చెరువులు, పరిసరాలు కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే వినాయక విగ్రహాల అలంకరణలో సహజమైన రంగులను వాడాలని, పూజలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ధర్మకోల్ వాడొద్దని మన భవిష్యత్తు తరాల శ్రేయస్సు కోసం ప్లాస్టిక్ వాడకాన్ని విడనాడాలని సూచించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా విద్యార్థులు మట్టితో గణేష్ బొమ్మలను తయారు చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మాగాపు సీతారత్నం, నాటి ధనరాజు, గెల్లా భూలక్ష్మీదేవి, కె.నాగ దివ్య, ఎన్ దేవకి, ఏ. ప్రత్యూష, ఏ.శిరీష, డి.వీర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు
