- విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 28 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, రోడ్డు ప్రమాదాల్లో
ప్రాణాపాయం నుండి రక్షణ పొంది, సురక్షితంగా గమ్య స్థానాలు చేరుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 27న
పిలుపునిచ్చారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా విజయనగరం ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో ద్విచక్ర
వాహనదారులకు హెల్మెట్ ధారణ పట్ల అవగాహన కల్పించేందుకు "హెల్మెట్ అవగాహన ర్యాలీ" విజయనగరం పట్టణం ఆర్టిసి కాంప్లెక్స్ నుండి కోట జంక్షన్, మూడు లాంతర్లు, గంట స్థంభం, కే.పి. టెంపుల్, చెన్నై షాపింగు మాల్, రైల్వే
స్టేషను రోడ్డు మీదుగా తిరిగి ఆర్టీసి కాంప్లెక్స్ చేరేంత వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన
కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ముఖ్య అతిథిగా హాజరై, హెల్మెట్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం
సాగించేందుకు ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. ప్రతి సంవత్సరం చాలా మంది వాహన
దారులు రహదారి ప్రమాదాలలో కేవలం హెల్మెట్ ధరించని కారణంగానే మరణిస్తున్నారు. వాహనదారులు హెల్మెట్ ధరించక పోవడం వలన రహదారి ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాల పాలై, గోల్డెన్ అవర్స్ లో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వాహనాలు నడిపినపుడు ప్రతీ వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరిస్తే, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పటికీ చిన్న గాయాలతో ప్రాణాలను రక్షించుకొనే పరిస్థితులు ఉంటాయన్నారు. రహదారి ప్రమాదాల్లో 50శాతం వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగానే మరణిస్తున్నారన్నారు. రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ధరించుట వలన కలిగే లబ్ధిని వాహనదారులకు వివరించి, హెల్మెట్ ధారణపట్ల అవగాహన కల్పించి, ప్రతీఒక్క వాహనదారుడు హెల్మెట్ ధరించే విధంగా చేయాలనే సంకల్పంతో జిల్లా పోలీసుశాఖ పని చేస్తుందన్నారు.
ప్రజలందరికి హెల్మ్ట్ ధారణ పట్ల అవగాహన కల్పించి, వారిలో చైతన్యం వచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు
చేపడతామని జిల్లా ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,
హెల్మెట్ ధరించని యెడల వాహనదారులపై ఎం.వి.నిబంధనలు ప్రకారం అపరాధ రుసుం విధిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనంపై ఇంటి నుండి బయటకు వస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నిర్లక్ష్యం కారణంగా వారి కుటుంబాలు వీధిన పడకూడదన్నారు. అతివేగం ప్రమాదకరమని, వేగంకన్నా సురక్షిత ప్రయాణం ముఖ్యమని జిల్లా ఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రాణాపాయం నుండి రక్షణ పొంది, ప్రమాదాల నివారణలో పోలీసుశాఖకు సహకరించాల్సిందిగా ప్రజలను జిల్లా ఎస్పీవకల్ జిందల్ కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిటిసి డి.మణికుమార్, ఎం.వి.ఐలు ఎం.మురళీకృష్ణ, యు.దుర్గా ప్రసాద్, డిఎస్పీలు ఎం.శ్రీనివాసరావు, యూనివర్స్, సిఐలు సూరి నాయుడు, ఎస్.శ్రీనివాస్,
టి.శ్రీనివాసరావు, జి.రామకృష్ణ, ఎస్.కాంతారావు, బి.లక్ష్మణరావు, ఆర్ఐలు ఎన్.గోపాల నాయుడు, శ్రీనివాసరావు,
ఇతర పోలీసు అధికారులు, ఆర్టీసి డిఎం, ఎస్.సి.సి. విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.