
జనం న్యూస్ ఆగస్టు 27 కోటబొమ్మాళి మండలం :
సింహాద్రిపురం ప్రాథమిక పాఠశాలలో మంగళవారం విద్యార్థులు మట్టి విగ్రహాలను తయారు చేసి పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు నారాయణరావు మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని విద్యార్థులకు వివరించారు.అలాగే, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) తో చేసిన విగ్రహాలు నీటిలో కరగవు, రసాయనాల వల్ల నీటి కాలుష్యం పెరుగుతుందని ఉదాహరణలతో వివరిస్తూ పర్యావరణానికి వాటి ద్వారా కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థులు తమ చేతులతో మట్టి విగ్రహాలను తయారు చేసి ఆచరణలో పర్యావరణ స్నేహపూర్వక దృక్పథాన్ని ప్రదర్శించారు.స్థానికులు విద్యార్థుల ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, సమాజంలో ఇలాంటి పర్యావరణ అవగాహన పెంచే కార్యక్రమాలు మరింతగా జరగాలని కోరుకున్నారు.