
జనం న్యూస్ ఆగస్టు 26:
నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం రోజునవినాయక చవితి పండుగనీ పురస్కరించుకొని విద్యార్థులచే మట్టితో గణపతి ప్రతిమలు తయారు చేసే విధంగా తర్ఫీదు ఇవ్వడం తో విద్యార్థులు సుమారు వందకు పైగా మట్టి గణపతులను వివిధ ఆకృతులలో చేయడం జరిగింది. విద్యార్థులకు ప్రకృతి పట్ల అభిమానం కలిగించడం మరియు పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు అందరు కూడా నడుం బిగించే విధంగా విద్యార్థులచే మట్టి గణపతులు సిద్ధం చేసి వాటిని పండుగ రోజున ఇంటి లోపల పూజల కోసం వినియోగించడం అనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గూర్చి పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి మాట్లాడుతూ విద్యార్థులు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం పాటుపడాలని దానిలో భాగంగానే మట్టితో తయారుచేసిన విగ్రహాలను ఇంటి లోపల ప్రతిష్టించుకొని నిమజ్జనం రోజున ఈ మట్టి గణపతులను నీళ్లలో వదలడం ద్వారా ఇలాంటి నీటి కాలుష్యం ఉండదని అందుకే ప్రతి ఒక్కరు మట్టి గణపతులతో పూజలు నిర్వహించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రసాద్ రాజనర్సయ్య ,రాజేందర్, ఎస్ శ్రీనివాస్ విజయ్ ,రాజశేఖర్, కె.శ్రీనివాస్, ప్రవీణ్ శర్మ, గంగా మోహన్, జ్యోతి , కోమలి పాల్గొన్నారు.